Tuesday, September 17, 2024
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: జింబాబ్వే రికార్డు విజయం

ICC WC Qualifiers: జింబాబ్వే రికార్డు విజయం

ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్-2023లో నేడు జరిగిన మ్యాచ్ లో అమెరికాపై 304 పరుగులతో జింబాబ్వే అద్భుత విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద విజయం. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన  ఈ మ్యాచ్ లో అమెరికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ (ఇన్నోసెంట్ కియా -32) కు జింబాబ్వే 56 పరుగులు చేసింది. రెండో వికెట్ కు గుంబే – కెప్టెన్ సీన్ విలియమ్స్ లు 160 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గుంబే 78 పరుగులు చేసి ఔట్ కాగా, ఆ తర్వాత వచ్చిన సికిందర్ రాజా-48; రియాన్ బర్ల్-47 రన్స్ సాధించారు. సీన్ విలియమ్స్ 101 బంతుల్లో 21  ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 408 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.

అమెరికా బౌలర్లలో అభిషేక్ పదార్కర్ 3;  జెస్సి సింగ్ 2; కేంజిగే ఒక వికెట్ సాధించారు.

అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం ముగ్గురు బ్యాట్స్ మెన్ మాత్రమే.. అభిషేక్ పరాడ్కర్-24; జస్ దీప్ సింగ్ -21; గజానంద్ సింగ్-13… రెండంకెల స్కోరు దాటారు. రిచర్డ్ నగరవ ,  సికిందర్ రాజా చెరో 2;  బ్రాడ్ ఎవాన్స్, జోంగ్వే, రియాన్ బర్ల్  తలా ఒక వికెట్ పడగొట్టారు.

సీన్ విలియమ్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్