Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: విండీస్ భారీ విజయం

ICC WC Qualifiers: విండీస్ భారీ విజయం

ఐసిసి వరల్డ్ కప్ 2023 క్వాలిఫైర్ మ్యాచ్ లలో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం సాధించింది. నేడు జరిగిన మ్యాచ్ లో నేపాల్ పై 101 పరుగుల తేడాతో గెలుపొందింది.  విండీస్ కెప్టెన్ షాయ్ హోప్(132); నికోలస్ పూరన్ (115) సెంచరీలతో చెలరేగారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ పరుగులు చేసింది.

హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో నేపాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ 9 పరుగులకే రెండు వికెట్లు (కేల మేయర్స్-1;  జేమ్స్ ఛార్లెస్ డకౌట్) కోల్పోయింది. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ 32 పరుగులు చేసి జట్టు స్కోరు 55 వద్ద ఔటయ్యాడు. నాలుగో వికెట్ కు హోప్-పూరన్ లు 216 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 94 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 ; హోప్ 129 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 132 పరుగులు చేసి ఔటయ్యారు. పావెల్-29; హోల్డర్-16 ( నాటౌట్) రన్స్ చేశారు. నేపాల్ బౌలర్లలో రాజ్ బన్షి-3; కరణ్, గుల్షాన్ ఝా. లమిచ్చేనే, దీపేంద్ర సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్య సాధనలో నేపాల్ 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టులో ఆరిఫ్ షేక్-63; గుల్షన్ ఝా-42; రోహిత్ పాడెల్-30 మాత్రమే ఫర్వాలేదనిపించారు. 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

విండీస్ కెప్టెన్ హోప్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్