ఐసిసి క్వాలిఫైర్స్ సూపర్ సిక్స్ దశలో నేడు జరిగిన మ్యాచ్ లో ఒమన్ పై వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్ లో స్కాట్లాండ్ పై ఓటమి పాలై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన కరేబియన్లకు ఇది ఊరట ఇచ్చే విజయం మాత్రమే.
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా జరిగిన నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఒమన్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. సూరజ్ కుమార్-53; షోయబ్ ఖాన్- 50; కాశ్యప్-31; అయాన్ ఖాన్-30 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రోమానియో షెఫర్డ్ 3; కేల్ మేయర్స్ 2; కెవిన్ సింక్లైర్-1 వికెట్ పడగొట్టారు.
విండీస్ 7 పరుగులకే తొలి వికెట్ (జాన్సన్ చార్లెస్-4) కోల్పోయింది. రెండో వికెట్ కు బ్రాండన్ కింగ్- కీసీ కార్టీ 80 పరుగులు జోడించారు. కార్టీ 29 రన్స్ చేసి వెనుదిరిగాడు. కింగ్- కెప్టెన్ హోప్ లు మూడో వికెట్ కు 96 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. కింగ్ సెంచరీ (100) పూర్తి కాగానే ఔటయ్యాడు. హోప్-63; నికోలస్ పూరన్-19 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.39.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది.
సెంచరీ సాధించిన బ్రాండన్ కింగ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.