Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్ICC Qualifiers: జింబాబ్వే కు స్కాట్లాండ్ షాక్ - టోర్నీ నుంచి ఔట్!

ICC Qualifiers: జింబాబ్వే కు స్కాట్లాండ్ షాక్ – టోర్నీ నుంచి ఔట్!

కరేబియన్ జట్టు వరల్డ్ కప్ కు అర్ఘత సాధించలేకపోవడం క్రికెట్ అభిమానులను నివ్వెర పరిచిన అంశం మరువకముందే  మరో సంచలనం నమోదైంది. కొంత కాలంగా మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్న జింబాబ్వే నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో ఓటమి పాలై  టోర్నీ నుంచి నిష్క్రమించింది.  స్వదేశంలో జరుగుతున్న ఈ క్వాలిఫైర్స్ లో విజయం సాధించి ప్రపంచ కప్ కు అర్హత సాధించాలని ఉవ్విళ్ళూరిన ఆ జట్టుకు నేటి ఓటమి శరాఘాతంగా నిలిచింది.

బులావాయో క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 234 పరుగులు చేసినా…. చక్కని బౌలింగ్ తో  ఈ స్కోరును కాపాడుకొని 31 పరుగులతో గెలుపొంది రేసులో నిలిచింది.

స్కాట్లాండ్ లో మైఖేల్ లీస్క్-48; మాథ్యూ క్రాస్- 38; బ్రాండన్ మెక్ ముల్లెన్-34;  మున్షీ-31; మార్క్ వాట్-21 పరుగులు చేశారు. 50  ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలింగ్ లో సీన్ విలియమ్స్ 3; చాటారా 2 ; నగరవ ఒక వికెట్ పడగొట్టారు.

జిమబాబ్వే 34 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వెస్లీ మదేవెరే-40; సికిందర్ రాజా –  34 పరుగులు చేసి ఔటయ్యారు.  రియాన్ బర్ల్ 83 పరుగులతో చివరి వరకూ  ఒంటరి పారాటం చేసినా సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ 3; బ్రాండన్ మెక్ ముల్లెన్, మైఖేల్ లీస్క్ చెరో 2; షఫ్యాన్  షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

క్రిస్ సోల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్