Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC World Cup Qualifiers: నేపాల్ పై నెదర్లండ్స్ విజయం

ICC World Cup Qualifiers: నేపాల్ పై నెదర్లండ్స్ విజయం

ఐసిసి వరల్డ్ కప్ -2023 క్వాలిఫైయర్స్ మ్యాచ్ లో నేపాల్ పై నెదర్లండ్స్ 7 వికెట్లతో విజయం సాధించింది. హరారే తకషింగ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లండ్స్  బౌలింగ్ ఎంచుకుంది.

నేపాల్ 44.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ అయ్యింది, జట్టులో కెప్టెన్ రోహిత్ పాడెల్-33; కుశాల్ భర్టేల్-27; లమిచ్చేన్నే-27; భిం షర్కి-22 పరుగులు చేశారు. నెదర్లండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 4; బాస్ దే లీడ్, విక్రమ్ జీత్ సింగ్ చెరో 2; క్లేటన్ ఫ్లాయిడ్, ఆర్యన్ దత్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత నెదర్లాండ్స్ తొలి వికెట్ కు 86 పరుగులు చేసింది. విక్రమ్ జీత్ 30 పరుగులు చేసి వెనుదిరగ్గా, ఫస్ట్ డౌన్ లో వచ్చిన వెస్లీ బర్రేసి (4) విఫలమయ్యాడు. ఓపెనర్ మాక్స్ ఒదౌద్ 75 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 90  రన్స్ సాధించి ఔటయ్యాడు.  బాస్ దే లీడ్-41; నిడమానూరు తేజ -2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 27.1 ఓవర్లలో 3  వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

మాక్స్ ఒదౌద్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్