Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: జింబాబ్వే పై శ్రీలంక ఘన విజయం

ICC WC Qualifiers: జింబాబ్వే పై శ్రీలంక ఘన విజయం

ఐసిసి క్వాలిఫైర్స్ సూపర్ సిక్స్ దశలో నేడు జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే పై శ్రీలంక 9 వికెట్లతో ఘన విజయం  సాధించింది. బులావాయో స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే…. లంక బౌలింగ్ దెబ్బకు 32.3 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని లంక 33.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక సెంచరీ (101) తో అజేయంగా నిలిచాడు.

జింబాబ్వే జట్టులో సీన్ విలియమ్స్-56; సికిందర్ రాజా-31 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. లంక బౌలర్లలో మహీష తీక్షణ 4; దిల్షాన్ మధుశంక 3; మతీశ పథిరణ 2; శనక ఒక వికెట్ పడగొట్టారు.

లంక తొలి వికెట్ కు 103 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నే 30 రన్స్ చేసి వెనుదిరిగాడు.  నిశాంక -101; కుశాల్ మెండీస్ – 25  పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

మహీష తీక్షణ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్