Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC World Cup Qualifiers: విండీస్ కు జింబాబ్వే షాక్

ICC World Cup Qualifiers: విండీస్ కు జింబాబ్వే షాక్

ఐసిసి క్వాలిఫైర్స్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 268 పరుగులు చేయగా, బౌలింగ్ లో సమిష్టిగా రాణించి విండీస్ ను 233 పరుగులకే ఆలౌట్ చేసి 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే లో సికిందర్ రాజా-68; రియాన్ బర్ల్-50;  కెప్టెన్ క్రేగ్ ఎర్విన్ -47 పరుగులు చేశారు.49.5 ఓవర్లలో 26౮ పరుగులకు ఆలౌట్ అయ్యింది. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3; అల్జారీ జోసెఫ్, అకీల్ హోసేన్ చెరో 2; కేల్ మేయర్స్, రోస్టన్ చేస్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో విండీస్ తొలి వికెట్ కు 43 రన్స్ చేసింది. జట్టులో కేల్ మేయర్స్-56; రోస్టన్-44; నికోలస్ పూరన్-34; హోప్-30 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 44.4 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

జింబాబ్వే బౌలర్లలో చటారా-3; రిచర్డ్ నగరవ, సికందర్ రాజా, ముజారబ్బానీ తలా 2; వెల్లింగ్టన్ ఒక వికెట్ పడగొట్టారు.

సికందర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్