Regional Parties :
ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం అవుతే కేంద్రంలో బిజెపి ని గద్దె దింపటం సులువు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆశాబావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బావ సారుప్యత కలిగిన పార్టీలను కలుపుకొని కేంద్రంలో ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని మమత వెల్లడించారు. నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ అధినేత శరద్ పవార్ తో మమత ఈ రోజు ముంబైలో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ ప్రత్యామ్నయ కూటమి ఏర్పాటుపై నేతలు ఇద్దరు సుదీర్గంగా చర్చించారు. మమతతో చర్చలు సానుకూలంగా జరిగాయని శరద్ పవార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకత్వంలో ఇప్పటికే ఓ కూటమి ఉందిగా అని విలేఖరులు ప్రశ్నించగా యుపిఏ కూటమి అంటే ఏమిటని, దేశంలో యుపియే కూటమి ఎక్కడ ఉందని మమత అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు సిబిఐ, ఈడి లతో దాడులు చేయిస్తూ అదుపు ఆజ్ఞల్లో ఉంచుకుంటున్నారని మమత విమర్శించారు. తృణముల్ కాంగ్రెస్ మాత్రం ముక్కవోని ధైర్యంతో బిజెపిని రాజకీయంగా ఎదుర్కుంటుందని తెగేసి చెప్పారు.
యుపిఎ, ఎన్.డి.ఏ లకు ప్రత్యామ్నయ వేదిక రూపొందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ళు ఉండటంతో బిజెపిని గద్దె దించేందుకు ప్రణాలికలు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ముంబైలో మకాం వేశారు. మూడు రోజుల పర్యటనలో ఎన్.సి.పి. , శివసేన నేతలతో సమావేశమయ్యారు. మంగళ వారం శివసేన నేతలు సంజయ్ రౌత్, ఆదిత్య థాకరే లతో సమావేశమయ్యారు.
Also Read : పార్లమెంటులో తెరాస నిరసనలు