Sunday, January 19, 2025
HomeTrending NewsUkraine Drone: మాస్కోపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి

Ukraine Drone: మాస్కోపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి

ఇన్నాళ్ళు రక్షణ వ్యూహంతో ఉన్న ఉక్రెయిన్ కొన్ని రోజులుగా రష్యాపై దారులకు దిగుతోంది. యూరోప్ దేశాలు, అమెరికా సాయంతో చెలరేగిపోతున్న ఉక్రెయిన్ రష్యా రాజధాని టార్గెట్ గా యుద్ద ప్రణాళిక రచిస్తోంది. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల‌తో దాడి చేసింది. అయితే ఆ దాడిలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. నాన్‌-రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్‌ల‌పై రెండు యూఏవీలు అటాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మాస్కోపై జ‌రిగిన డ్రోన్ దాడి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదం అవుతుంద‌ని ర‌ష్యా విదేశాంగ మంత్రి మారియా ఆరోపించారు. ఇవాళ తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కు మాస్కోపై డ్రోన్ అటాక్ జ‌రిగింది.

అయితే ఎల‌క్ట్రానిక్‌ డివైస్‌ల ద్వారా ర‌ష్యా ఆర్మీ ఆ డ్రోన్ల‌ను నేల‌కూల్చింది. మాస్కో సెంట‌ర్‌లో ఉండే కాంసోమాల‌స్కీ ప్రోస్పెక్ట్ బిల్డింగ్ వ‌ద్ద డ్రోన్లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. డ్రోన్ పేలుడు ధాటికి బిల్డింగ్‌లో ఉన్న అద్దాల కిటికీలు ప‌గిలిపోయాయి. ద‌క్షిణ మాస్కోలో ఉన్న బ‌హుళ అంత‌స్థు భ‌వ‌నంపై రెండో డ్రోన్ దాడి చేసింది. ఆ రూట్లో రోడ్డును మూసివేశారు. ఉక్రెయిన్ రాత్రి వేళల్లో డ్రోన్ల‌తో దాడికి దిగుతోంది.

ఉక్రెయిన్ ఇదే పరంపర కొనసాగిస్తే రష్యా తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పై క్రెమ్లిన్ ముప్పేట దాడికి దిగే అవకశాలు కొట్టిపారేయలేమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్