Friday, June 12, 2026
Homeసినిమావిజ‌య్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

విజ‌య్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

Sentiment: ప్ర‌తి ఒక్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అదే ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో న‌టించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఆ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమా 2017 ఆగ‌ష్టు 25న రిలీజైంది. అప్ప‌టి నుంచి ఆగ‌ష్టు నెల విజ‌య్ కి సెంటిమెంట్ గా మారింది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… విజ‌య్, పూరి కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ మూవీ లైగ‌ర్. బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన లైగ‌ర్ ట్రైల‌ర్ యూట్యూబ్ ని షేక్ చేసి రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది.

అయితే.. అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ నే వ‌స్తున్న లైగ‌ర్ మూవీ కూడా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. విజ‌య్ అయితే.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంది. లైగ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని చెబుతున్నారు. దీంతో లైగ‌ర్ పై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి లైగ‌ర్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Also Read : లైగ‌ర్ ట్రైల‌ర్ పై వంగా రియాక్ష‌న్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular