Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Wimbledon: సెమీస్ కు జకోవిచ్, సిన్నర్

Wimbledon: సెమీస్ కు జకోవిచ్, సిన్నర్

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ లో సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సెమీస్ లో ప్రవేశించాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్ లో రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్ పై 4-6; 6-1;6-4;6-3 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్ కోల్పోయినా  ఆ తర్వాతా తేరుకొని ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తనదైన షాట్లతో అలరించి మట్టికరిపించాడు.

మరో మ్యాచ్ లో ఇటలీ ఆటగాడు జెన్నిక్ సిన్నర్ 6-4; 3-6; 6-2;6-2 తేడాతో రష్యా ప్లేయర్ సఫియుల్లిన్ పై గెలుపొందాడు.

కాగా, మహిళల సింగిల్స్  క్వార్టర్ ఫైనల్స్ లో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ పోలాండ్ భామ ఇగా స్వియటెక్ కు షాక్ తగిలింది.  ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్విటోలినా చేతిలో ఓటమి పాలై నిష్క్రమించింది. 7-5; 6-7; 6-2 తేడాతో ఎలీనా గెలుపొందింది.

నేడు జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్ లో క్రొయేషియా క్రీడాకారిణి వొండ్రుసోవా అమెరికన్ ప్లేయర్ పెగులా పై 6-4;2-6; 6-4  తో విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది.

కాగా ఇండియా ఆటగాడు రోహన్ బోపన్న – ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి పురుషుల డబుల్స్ లో క్వార్టర్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన మ్యాచ్ లో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)- రీస్ స్టాల్దర్ (అమెరికా)జోడీపై 7-5; 4-6; 7-6 తో గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular