Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్US Open-2022: మహిళల సింగిల్స్ విజేత స్వియటెక్

US Open-2022: మహిళల సింగిల్స్ విజేత స్వియటెక్

పోలెండ్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియటెక్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో ట్యునీషియా ప్లేయర్, ఐదో సీడ్ ఓన్స్ జాబెర్ పై  6-2;7-6 తేడాతో గెలుపొంది తన కెరీర్ లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకుంది.

2020, 22 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెల్చుకున్న స్వీయటెక్ నేడు యూఎస్ ఓపెన్ తన ఖాతాలో వేసుకుంది.  ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఆమె నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతోంది. జూన్ 4న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్ పై 6-1;6-3తో విజయం సాధించి టైటిల్ గెల్చుకుంది.

నేటి యూఎస్ ఓపెన్ టైటిల్ తో ఆమెకు భారత కరెన్సీ ప్రకారం షుమారు 20 కోట్ల 70 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కింద అందుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్