Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ - హను సినిమా హీరోయిన్ గా ఇమాన్వి

ప్రభాస్ – హను సినిమా హీరోయిన్ గా ఇమాన్వి

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమా  నేడు లాంఛనంగా ప్రారంభమైంది.  సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే  ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నేడు జరిగిన మూవీ ప్రారంభ వేడుకకు ఇమాన్వి కూడా హాజరైంది.

స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథ ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సితారామం సినిమాను కూడా హను రాఘవాపూడి ఇదే తరహా కథతో తీసి హిట్ సాధించి, విమర్శకుల ప్రశంసలు పొందారు.  ఈ సినిమాలో హీరోయిన్ గా తొలుత మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత త్రిష పేర్లు కూడా పరిశీలించినా చివరకు ఓ కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో ఇమాన్విని ఖరారు చేశారు.

దేవుళ్ళ ఫోటోలపై చిత్రీకరించిన తొలి షాట్ కు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ క్లాప్ ఇచ్చారు. బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలకపాత్రలు పోషించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్