Saturday, November 23, 2024
HomeTrending Newsపాక్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధనలు

పాక్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధనలు

పాకిస్తాన్ ప్రధానమంత్రి షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వరకు వారానికి ఐదు రోజులు మాత్రమె పనిదినాలు కాగా ఇప్పటి నుంచి ఆరు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు సేవలు అందిస్తాయని ప్రధానమంత్రి ఈ రోజు ప్రకటించారు. పని వెలలు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ద్రవ్యోల్భణం పెరిగిపోతున్న దృష్ట్యా అన్ని వర్గాలు క్రమశిక్షణగా ఉంటేనే దేశం గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతుందని పాక్ ఆర్థిక వేత్తలు కొత్త ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేదంటే శ్రీలంక పరిస్థితే వస్తుందని చెప్పటంతో కొత్త ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇమ్రాన్ ఖాన్ హయంలో వారానికి అయిదు పనిదినాలు మాత్రమె ఉండేవి.

ఇమ్రాన్ ఖాన్ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తామని బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు, ప్రధానమంత్రి కుమార్తె మరియం నవాజ్ ప్రకటించారు. పాక్ కొత్త ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడదని, అవినీతిపరులను మాత్రం ఉపెక్షించబోదని మరియం నవాజ్ స్పష్టం చేశారు.

మరోవైపు పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ రేపు పెషవార్ లో ర్యాలీ నిర్వహిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగాక ఇమ్రాన్ ఖాన్ మొదటిసారిగా పాల్గొంటున్న బహిరంగసభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Also Read : పాక్ లో రాజకీయ అస్థిరత

RELATED ARTICLES

Most Popular

న్యూస్