Saturday, November 23, 2024
HomeTrending Newsలాహోర్ లోని ఇమ్రాన్ నివాసం వద్ద హై డ్రామా

లాహోర్ లోని ఇమ్రాన్ నివాసం వద్ద హై డ్రామా

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కోసం పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. ఈ రోజు లాహోర్ నివాసంలోకి వెళ్ళిన పోలీసులు ఇమ్రాన్ కోసం వాకబు చేశారు. అయితే ఆయ‌న కోర్టు కేసు నిమిత్తం ఇస్లామాబాద్ వెళ్లారు. ఆ స‌మ‌యంలో పోలీసులు భారీ సంఖ్య‌లో ఇమ్రాన్ ఇంటిని చుట్టుముట్టి లోప‌లికి ప్ర‌వేశించారు. అవినీతి కేసులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ఇమ్రాన్ ఇస్లామాబాద్ వెళ్లారు. పోలీసులు వచ్చిన స‌మ‌యంలో ఇంట్లో త‌న భార్య బుష్రా బేగం ఒక్క‌తే ఉన్న‌ట్లు ఇమ్రాన్ తెలిపారు. ఇది లండ‌న్ ప్లాన్‌లో భాగంగా జ‌రిగిన అటాక్ అని ఇమ్రాన్ త‌న ట్వీట్‌లో ఆరోపించారు.
తోషాఖానా కేసులో ఇప్ప‌టికే ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ఇంటిపైకి పోలీసులు వెళ్ల‌గా .. ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ప్ర‌తిఘ‌టించారు. త‌మ ఆప‌రేష‌న్ ఫెయిల్ కావ‌డంతో.. పోలీసులు జ‌మాన్ పార్క్ నుంచి వెనుదిరిగి వెళ్లారు. త‌న ఆస్తుల డిక్ల‌రేష‌న్‌లో విదేశీ గిఫ్ట్‌ల వివ‌రాల‌ను ఇమ్రాన్ వెల్ల‌డించ‌లేద‌ని పాకిస్థాన్ ఎన్నిక‌ల సంఘం(PEC) త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది. ఆ కేసులో అత‌ను విచార‌ణ ఎదుర్కోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశానికి తేదీ, ప్రదేశాన్ని నిర్ణయించాలని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలని తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ ఫవాద్‌ చౌదరి మాట్లాడుతూ చర్చలకు ఇమ్రాన్‌ఖాన్‌ సైతం సిద్ధంగా ఉన్నారన్నారు. దేశం కోసం ఎవరితోనైనా మాట్లాడేందుకు, ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఇమ్రాన్‌ఖాన్‌ శుక్రవారం ప్రకటించారు. పాకిస్తాన్‌ అభ్యున్నతి, ప్రజాస్వామ్యం కోసం నేను ఎలాంటి త్యాగాలకైనా వెనుకడుగు వేయనని, ఈ విషయంలో నేను ఎవరితోనైనా మాట్లాడటానికి, ఈ దిశలో ప్రతి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఫవాద్‌ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్