Saturday, November 23, 2024
HomeTrending Newsపదవి కాపాడుకునేందుకు ఇమ్రాన్ పాట్లు

పదవి కాపాడుకునేందుకు ఇమ్రాన్ పాట్లు

విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, సొంత పార్టీ నుంచి కొంత మంది ఎంపీలు విపక్షాలకు మద్దతు తెలపటం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ మిలిటరీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ఇద్దరు సుమారు రెండు గంటలపాటు చర్చించారు. ఈ నెల 24న ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (OIC) సమావేశం కోసం వివిధ ముస్లీం దేశాల నుంచి విదేశాంగ మంత్రులు వస్తున్నారు. సమావేశంలో పాక్ అనుసరించాల్సిన విధానాలు, విపక్షాల అవిశ్వాస తీర్మానం, బెలోచిస్తాన్ లో ఇటీవల సైన్యంపై, చైనా కంపెనీలపై జరుగుతున్న దాడులు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.

అయితే ఇస్లామాబాద్ నగరంలో సింద్ హౌస్ పై ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసి విధ్వంసం సృష్టించటం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అంశం ఆర్మీ చీఫ్ ప్రస్తావించారని సమాచారం. విపక్ష పార్టీలపై చట్ట పరమైన చర్యల పేరుతో ఎలాంటి ఒత్తిడి చేయొద్దని, ప్రజాస్వామ్య పరిధిలో వ్యవహరించాలని ఇమ్రాన్ ఖాన్ కు ఆర్మీ చీఫ్ హితబోధ చేసినట్టు పాక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఈ నెలాఖరుతో గద్దె దిగాల్సిన అగత్య్తం ఏర్పడింది. ఎల్లుండి నుంచి పాకిస్తాన్ పార్లమెంటు సమావేశాలు ఆరంభం అవుతుండగా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 28 వ తేదిన ఓటింగ్ జరగనుంది.

మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(PTI) మిత్రపక్షమైన పాకిస్తాన్ ముస్లిం లీగ్-క్యేడ్(PML-Q) నాయకుడైన చౌదరి షుజాట్ హుస్సేన్ అవిశ్వాసంపై నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. తమ పార్టీ ఎవరికీ అమ్ముడు పోదని, పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా నడుచుకుంటామని హుస్సేన్ అన్నారు.

Also Read : ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం?

RELATED ARTICLES

Most Popular

న్యూస్