Saturday, January 18, 2025
HomeTrending Newsబంగ్లాదేశ్ లో లూటీలు, గృహ దహనాలు

బంగ్లాదేశ్ లో లూటీలు, గృహ దహనాలు

బంగ్లాదేశ్లో అల్లరి మూకలు చెలరేగుతున్నాయి. రంగపూర్ జిల్లాలో మైనారిటీ హిందువులకు చెందిన 20 ఇళ్ళను అల్లరి మూకలు అగ్నికి ఆహుతి చేశాయి. మరో డెబ్బై ఇళ్ళను లూటి చేసినట్టు సమాచారం. జమాత్ ఎ ఇస్లామి విద్యార్ధి విభాగం ఇస్లామి చాత్ర శిభిర్ కు చెందిన వారే ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్టు ఢాకా ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది.

ఇటీవల నౌఖలి జిల్లాలో ఇస్కాన్ మందిరంపై సాముహిక దాడి, అందులో ఇద్దరు మరణించటం వివాదాస్పదం అయింది. దీనిపై రెండు వర్గాల వారు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లరి మూకలను కట్టడి చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. తాజాగా చిట్టగాంగ్, బండర్బాన్, చంద్పూర్, మౌల్వి బజార్ పీర్ గంజ్ ప్రాంతాలకు అల్లర్లు విస్తరించాయి. దుర్గ పూజ సందర్భంగా కొందరు మతోన్మాదులు చేసిన విపరీత వ్యాఖ్యల వల్లే గొడవలు మొదలయ్యాయని ఢాకా ట్రిబ్యూన్ వివరించింది. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేయటంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్సారం చేయటం విమర్శలకు దారితీస్తోంది.

బంగ్లాదేశ్ లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని దేశ హోం శాఖ మంత్రి అస్సాడుజమాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గ పూజ పండాల్ ఉన్న ప్రాంతాలపై వరుస దాడులు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నవని, తొందరలోనే నేరస్తులను పట్టుకుంటామని మంత్రి చెప్పారు. మరోసారి ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా అల్లర్లకు కారణమైన వారిని కటినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్