Thursday, March 19, 2026
HomeTrending Newsదేశంలో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్‌ టీచర్లు

దేశంలో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్‌ టీచర్లు

కాంట్రాక్ట్‌ పద్దతిపై పని చేస్తున్న టీచర్ల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులుk విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో ఆవర్‌లో ఆయన కాంట్రాక్ట్‌ టీచర్ల సమస్యను లేవనెత్తారు. కాంట్రాక్ట్ పద్దతిపై టీచర్లను నియమించే ప్రక్రియ రానురాను తీవ్ర సమస్యాత్మకంగా మారిందన్నారు. మొదట్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాంట్రాక్ట్‌ పద్దతిపై టీచర్ల నియామకాలు జరిగేవి. తర్వాత కాలంలో ఇది ఆనవాయితిగా మారిపోయిందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్‌ టీచర్లు ఉన్నారు. అంటే దేశంలోని మొత్తం టీచర్ల సంఖ్యలో 13 శాతం మంది కాంట్రాక్ట్‌ టీచర్లే. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల విద్యార్ధులు అధిక శాతం చదివే స్కూళ్ళలో కాంట్రాక్ట్‌ టీచర్ల సంఖ్య 41 శాతానికి చేరుకుంది. కేవలం అయిదేళ్ళ వ్యవధిలో దేశ విద్యా రంగంలో లక్ష మంది కాంట్రాక్ట్‌ టీచర్ల నియామకం జరిగిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
కాంట్రాక్ట్‌ టీచర్ల నియామకం తాత్కాలిక ప్రాతిపదికపైన జరుగుతుంది. రెగ్యులర్‌ టీచర్ల మాదిరిగా వారికి సర్వీసు ప్రయోజనాలు ఉండవు. ఉద్యోగ భద్రత లేదు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తుంటారని ఆయన చెప్పారు. ఈ కారణాల వలన కాంట్రాక్ట్‌ టీచర్లలో నానాటికీ అసంతృప్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యల వత్తిడి కారణంగా బోధన పట్ల వారిలో ప్రేరణ కొరవడుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. దేశంలో టీచర్ల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతున్నకారణంగా విద్యారంగంలోకి ప్రతిభావంతులైన టీచర్లను ఆకర్షించలేకపోతున్నాం. ఫలితంగా విద్యా బోధనలో నాణ్యత సన్నగిల్లుతోందన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో భవః అంటూ భారతీయ సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా పరిగణిస్తాం. కానీ టీచర్లందరినీ సమదృష్టితో చూడలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Also Read : చైనా ఉత్పాదనలపై యాంటీ డంపింగ్ డ్యూటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular