Thursday, May 8, 2025
HomeTrending NewsManipur: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు

Manipur: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మరోసారి చోటుచేసుకున్నాయి. బిష్ణుపూర్‌ జిల్లాలో గురువారం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. రెండు గ్రూపులకు చెందిన కొంతమంది మిలిటెంట్లు ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మిలిటెంట్లను చెదరగొట్టారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 50 కి.మీ దూరంలోని ఫౌబాక్‌చావో ఇకాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మిలిటెంట్లు ఓ ఇంటిని తగలబెట్టారు. దీంతో స్థానికులు తమ ఇండ్లను విడిచిపెట్టి సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు.

మణిపూర్‌లో విధ్వంస పరిస్థితులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ ఖామ్‌ ఖాన్‌ సుయాన్‌ హాసింగ్‌పై క్రిమినల్‌ కేసు పెట్టడాన్ని దేశ, విదేశాలకు చెందిన 32 మంది విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వారు ప్రకటన చేస్తూ ఇది రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్ర హక్కును హరించే ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు.

ఇటీవల మణిపూర్‌లో చోటుచేసుకున్న అకృత్యాలపై ప్రొఫెసర్‌ హాసింగ్‌ ‘వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీయడమే కాక ఒక వర్గం వారికి అనుకూలంగా ఉన్నాయని ఆషెం తరుణకుమారి దేవీమైతీ ట్రైబ్స్‌ యూనియన్‌ (ఎంటీయూ) సభ్యుడు మణిహార్‌ మొయిరంగథమ్‌ సింగ్‌ ఫిర్యాదు చేయడంతో హాసంగ్‌కు ఈ నెల 6న ఇంఫాల్‌ తూర్పు జిల్లా కోర్టు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ సమన్లు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్