Saturday, November 23, 2024
HomeTrending Newsమణిపూర్ లో కుకి తీవ్రవాదుల ఘాతుకం

మణిపూర్ లో కుకి తీవ్రవాదుల ఘాతుకం

మణిపూర్ రాష్ట్రంలో తీవ్రవాదులు అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. కంగ్పోక్పి జిల్లా బి గంనోం గ్రామంలో ఈ రోజు ఉదయం కుకి మిలిటెంట్ల కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎనిమిదేళ్ళ కుర్రాడు ఉన్నాడు. సుమారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం హింగోజాంగ్ గ్రామంలో భద్రత బలగాల చేతిలో హతమైన ఇద్దరు మిలిటెంట్ల మృతదేహాలను గ్రామస్తులు ఖననం చేస్తుండగా ఇది జరిగింది. మిలిటెంట్లు కాల్పులు జరిపిన సమయంలో అక్కడ ప్రజలు భారీ సంఖ్యలో జనసమూహం ఉందని మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాల్పుల్లో చనిపోయిన వారిలో ముగ్గురి మృతదేహాలు లభించగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కుకి నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఈ దారుణానికి ఒడిగట్టిందని, అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులకు తగిన రీతిలో ప్రజలే బుద్ది చెపుతారాని మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అన్నారు. తీవ్రవాదుల చర్యను సిఎం బిరెన్ సింగ్ ఖండించారు.

కాల్పుల ఘటన చోటు చేసుకున్నాక బి గంనోం గ్రామం నిర్మానుష్యంగా మారింది. గ్రామస్తులంతా ప్రాణ భయంతో సమీపంలోని అడవుల్లోకి, కొండల్లోకి పారిపోయారు. గత వారం రోజుల నుంచి అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు, సైనిక బలగాలు కంగ్పోక్పి జిల్లాలో మిలిటెంట్ల కోసం అణువణువు గాలిస్తున్నారు. ఈ జిల్లాలో తీవ్రవాదుల కదలికలు పెరిగాయని సమాచారంతో నిఘా ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో మణిపూర్ లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో పట్టు కోసం తీవ్రవాదులు, భద్రతా బలగాలు, రాజకీయ నాయకులు ఎవరికీ తోచిన రీతిలో వారు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్