Sunday, March 15, 2026
HomeTrending Newsహైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు

హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు

హైదరాబాదులో ఆదాయపన్ను శాఖ మరోసారి దాడులు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాల్లోనూ, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఇటీవల హానర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాసవి, సుమధర రియల్ ఎస్టేట్ సంస్థలతో హానర్స్ పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ పైనే కాకుండా, వాసవి, సుమధర సంస్థలకు చెందిన ఆస్తులు, నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో మొత్తం 15 ఐటీ బృందాలు పాలుపంచుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular