Tuesday, April 16, 2024
HomeTrending Newsనార్త్ కరోలినాలో కాల్పులు

నార్త్ కరోలినాలో కాల్పులు

అమెరికాలో మరోసారి ఆయుధాల బీభత్సం కొనసాగుతోంది. ఉత్తర కరోలినా(North Carolina)లో స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడొక దుండగుడు. రాజధాని రాలి(Raleigh)లో జరిగిన ఈ ఘటనలో పోలీసులతో సహా ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. దీంతో పాటు దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దాడి చేసిన వ్యక్తి అకస్మాత్తుగా రద్దీగా ఉండే ప్రాంతానికి వచ్చి కాల్పులు జరిపాడని అమెరికన్ ఏజెన్సీలు తెలిపాయి. తనకు ఎదురుగా కనిపించిన వారిని కనిపించినట్లుగా కాల్చడం మొదలు పెట్టాడు. ఈ సమయంలో ఐదుగురు మరణించారని.. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం దాడి చేసిన వ్యక్తిని విచారిస్తున్నారు.

ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే అమెరికాలోని ఓ కోర్టు కీలక తీర్పు నిచ్చింది. 2018 ఫ్లోరిడా హైస్కూల్‌ షూటింగ్‌లో కాల్పులకు తెగబడి 17 మందిని కాల్చి చంపిన నికోలస్ క్రజ్‌కు కోర్టు శిక్ష విధించింది. మరణశిక్షను తిరస్కరించిన కోర్టు నికోలస్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే మరోసారి కాల్పుల కలకలం అమెరికాను దిగ్భాంత్రికి గురిచేసింది.

అమెరికాలో తుపాకీ కాల్పుల విధ్వంసం కొనసాగుతోంది. అమెరికాలో తుపాకీని కొనడం ఎవరికైనా చాలా సులభం. వస్తువులను విక్రయించినట్లుగానే అక్కడి దుకాణాల్లో తుపాకులు కూడా అమ్ముతుంటారు. తుపాకీ సంస్కృతి విధ్వంసం దృష్ట్యా.. అధ్యక్షుడు జో బిడెన్ దీనికి సంబంధించి కఠినమైన చట్టాన్ని రూపొందించడం గురించి ఎన్నికల్లో ప్రచారంగా నిర్వహించారు. ఆ తర్వాత దానిపై ఒక చట్టం కూడా చేశారు. ఇది ప్రజల ప్రాణాలను కాపాడుతుందని బిడెన్ చెప్పారు. ముఖ్యంగా ఆయుధాల విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా తుపాకులు కొనుగోలు చేసే వారిపై కఠినంగా విచారణ జరిపి అనుమానాస్పద లేదా ప్రమాదకరమైన వారి నుంచి తుపాకులను వెనక్కి తీసుకుంటారు. అమెరికాలో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ సామూహిక కాల్పుల ఘటనలు ఆగడం లేదు.

Also Read : మయన్మార్ లో పాఠశాల విద్యార్థులపై కాల్పులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్