Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్నింపాదిగా ఆడిన ఇండియా – 181/6

నింపాదిగా ఆడిన ఇండియా – 181/6

లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగోరోజు ఆట నెమ్మదిగా సాగింది. తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. అజింక్యా రేహానే- చటేశ్వర్ పుజారా లు నెమ్మదిగా ఆడి మ్యాచ్ ను డ్రా దిశగా నడిపించే ప్రయత్నం చేశారు కానీ ఇంగ్లాండ్ తరచూ బౌలర్లను మార్చి చివరి సెషన్ లో మూడు వికెట్లు  కొద్ది సమయంలోనే పడగొట్టడంతో ఇండియా ఆరు వికెట్లు కోల్పోయింది. రేహానే-61; పుజారా- 45 పరుగులు చేసి ఔటయ్యారు. రిషభ్ పంత్ -14; ఇషాంత్ శర్మ- 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్-3; మొయిన్ అలీ-2 వికెట్లు పడగొట్టగా మరో వికెట్ శామ్ కరణ్ కు దక్కింది. నాలుగోరోజు పూర్తయ్యే సమయానికి ఇండియా 154 ఆధిక్యంతో ఉంది, ఐదోరోజు మొదటి సెషన్ తో మ్యాచ్ డ్రా అవుతుందా లేదా ఫలితం తేలుతుందా అనేది ఖరారవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్