Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఆధిక్యం

India 49 runs lead:
న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 49 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.  ఇండియా బౌలర్లు అక్షర పటేల్-5, రవిచంద్రన్ అశ్విన్-3 వికెట్లతో రాణించడంతో 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. నిన్న రెండో రోజు వికెట్లేమీ నష్టపోకుండా 129 పరుగులు చేసిన కివీస్ నేడు కూడా నెమ్మదిగానే ఆడింది. లాథమ్, యంగ్ లు మొదటి వికెట్ కు 151పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, 89 పరుగులు చేసిన యంగ్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. టేలర్(11)), నికోలస్(2) త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ లాథమ్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు, 95 పరుగుల వద్ద అక్షర పటేల్ బౌలింగ్ లో శ్రీకర్ భరత్ స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత  వచ్చిన వారిలో టామ్ బ్లండేల్-13; రచిన్ రవీంద్ర-13, కేల్ జేమిసన్-23 పరుగులు చేశారు. అక్షర్-5, అశ్విన్-3, ఉమేష్ యాదవ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత రెండో ఇండియా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన శుభమన్ గిల్ జేమిసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి, మొత్తంగా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. మయాంక్ అగర్వాల్-4; పుజారా-9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Also Read : టెస్ట్: ఇండియా-345; న్యూజిలాండ్ 129/0

RELATED ARTICLES

Most Popular

న్యూస్