Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Ind Vs. Aus: లియాన్ స్పిన్ మ్యాజిక్:  గెలుపు బాటలో ఆసీస్ 

Ind Vs. Aus: లియాన్ స్పిన్ మ్యాజిక్:  గెలుపు బాటలో ఆసీస్ 

ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ బౌలింగ్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లోనూ ఇండియా చేతులెత్తేసింది. పుజారా మినహా మిగిలిన వారు విఫలంకావడంతో 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  లియాన్ 8 వికెట్లతో ఇండియా బ్యాటింగ్ ను కకావికలం చేయగా, స్టార్క్, కునేమాన్ చెరో వికెట్ పడగొట్టారు. సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో ఇండియా ఘోరంగా విఫలమైంది. పుజారా-శ్రేయాస్ లు ఐదో వికెట్ కు సాధించిన 35 రన్స్ అధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అయ్యర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 రన్స్ చేశాడు.

తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు 156 పరుగుల వద్ద నేడు రెండోరోజు ఆట మొదలు పెట్టిన ఆసీస్ 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జడేజా నిన్న నాలుగు వికెట్లు పడగొట్టగా మిగిలిన ఆరులో అశ్విన్, ఉమేష్ కు చెరో మూడు దక్కాయి. ఆసీస్ 88 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 15 పరుగుల వద్ద తొలి వికెట్ (శుభ్ మన్ గిల్-5) కోల్పోయింది. అప్పటి నుంచి బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. రోహిత్ శర్మ-12; విరాట్ కోహ్లీ-13; రవీంద్ర జడేజా-7; శ్రేయాస్ అయ్యర్-26; శ్రీకర్ భరత్-3 ; రవిచంద్రన్ అశ్విన్-16 పరుగులు చేయగా, ఉమేష్ యాదవ్, సిరాజ్ డకౌట్ అయ్యారు. పుజారా ఒక్కడే 59పరుగులతో రాణించి ఎనిమిదో వికెట్ గా ఔటయ్యాడు.

ఈ టెస్టు విజయానికి ఆసీస్ కేవలం  75  పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్