Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్ఇండియా 202 ఆలౌట్; సౌతాఫ్రికా 35/1

ఇండియా 202 ఆలౌట్; సౌతాఫ్రికా 35/1

India 205 all-out: సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఇండియా 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జోహెన్స్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో కెప్టెన్ కెఎల్ రాహుల్-50; రవిచంద్రన్ అశ్విన్-46  మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. పుజారా మరోసారి నిరాశ పరిచి మూడు పరుగులకే అవుట్ కాగా, అజింక్యా రెహానే డకౌట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్-26; హనుమ విహారి-20 పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్ కూడా డకౌట్ అయ్యాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సేన్ నాలుగు; రబడ, ఒలివియర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

సౌతాఫ్రికా 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడెన్ మార్ క్రమ్ 11 పరుగులు చేసి షమి బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్-11; కీగాన్ పీటర్సన్-14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Also Read : కోహ్లీకి వెన్ను నొప్పి: కెప్టెన్ గా రాహుల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular