Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్Ind Vs Aus: నాలుగో టెస్ట్ డ్రా : WTC ఫైనల్ కు ఇండియా

Ind Vs Aus: నాలుగో టెస్ట్ డ్రా : WTC ఫైనల్ కు ఇండియా

అందరూ ఊహించినట్లే అహ్మదాబాద్ టెస్ట్ డ్రాగా ముగిసింది.   దీనితో ఆసీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1తో గెల్చుకున్న ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూ టి సి ) ఫైనల్ కు అర్హత సంపాదించింది.  ఇవే రెండు జట్లూ ఇండియా-ఆస్ట్రేలియా జూన్ లో జరిగే ఫైనల్లో తలపడనున్నాయి.

నిన్న నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ లో కేవలం మూడు పరుగులే చేసిన ఆసీస్14 వద్ద ఓపెనర్ కున్నేమాన్ వికెట్ (6) కోల్పోయింది.  రెండో వికెట్ కు ట్రావిస్ హెడ్ –లబుషేన్ లు 139రన్స్ జోడించారు. హెడ్ 90 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. టీ విరామానికి ముందు 175 పరుగుల వద్ద ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఇన్నింగ్స్ ఆపివేస్తున్నట్లు సూచిస్తూ ఇండియా కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ …… రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా లకు సంయుక్తంగా ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular