Tuesday, April 1, 2025
Homeస్పోర్ట్స్బంగ్లాదేశ్ పై ఇండియా ఘనవిజయం

బంగ్లాదేశ్ పై ఇండియా ఘనవిజయం

Hockey- India beat Bangladesh:

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2021 పురుషుల హాకీ టోర్నమెంట్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ ను 9-0 తేడాతో ఓడించి ఈ టోర్నీలో తొలి విజయాన్ని ఇండియా నమోదు చేసింది. నిన్న కొరియాతో జరిగిన మ్యాచ్ ­2-2 డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో ఆశించిన ఫలితం రాకపోవడంతో డీలా పడిన ఆటగాళ్ళు, హాకీ అభిమానులు నేటి విజయాన్ని ఆస్వాదించారు. ఆతిథ్య బంగ్లాదేశ్ ఏ దశలోనూ భారత జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది.

ఆట తొలి పావు భాగంలో 12 వ నిమిషంలో ఇండియా మొదటి గోల్ చేసింది. తొలి క్వార్టర్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. 22  28, 31, 42, 44, 54, 55, 57 నిమిషాల్లో గోల్స్ సాధించింది. ఈ తొమ్మిది గోల్స్ లో నాలుగు ఫీల్డ్ గోల్స్ కాగా మిగిలిన ఐదు పెనాల్టీ కార్నర్ ద్వారా రాభించాయి.  ఎల్లుండి జరిగే మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ తో తలపడనుంది. ఫీల్డ్ గోల్స్ లో మూడు దిల్ ప్రీత్ సాధించగా మరో గోల్ ఆకాష్ దీప్ చేశాడు.

Also Read : ఇండియా-కొరియా మ్యాచ్ డ్రా

RELATED ARTICLES

Most Popular

న్యూస్