Thursday, March 13, 2025
Homeస్పోర్ట్స్FIH Pro-league: బెల్జియంపై ఇండియా గెలుపు

FIH Pro-league: బెల్జియంపై ఇండియా గెలుపు

ఎఫ్ ఐ హెచ్ ప్రొ లీగ్ లో భారత జట్టు ట్రాక్ లో పడింది. నేడు జరిగిన మ్యాచ్ లో బెల్జియంపై 5-1 తేడాతో విజయం సాధించింది. గత వారం జరిగిన రెండు మ్యాచ్ ల్లో బెల్జియం, గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

నేటి మ్యాచ్ లో ఆట రెండవ నిమిషంలోనే ఇండియా ప్లేయర్ వివేక్ సాగర్ ప్రసాద్ ఫీల్డ్ గోల్ తో స్కోరు బోణీ చేశాడు. 21,29,30 నిమిషాల్లో ఇండియా మరో మూడు గోల్స్ సాధించింది. వీటిలో రెండు పెనాల్టీ కార్నర్, ఒక ఫీల్డ్ గోల్ ఉన్నాయి.

46వ నిమిషంలో బెల్జియం ఆటగాడు ఘిశైలన్ విలియం ఫీల్డ్ గోల్ చేసి ఒక పాయింట్ సాధించాడు.

ఆట చివరి క్షణాల్లో ఇండియా ప్లేయర్ దిల్ ప్రీత్ సింగ్ మరో ఫీల్డ్ గోల్ సాధంచి ఆధిక్యాన్ని 5-1కు చేర్చాడు.

నేడు శనివారం ఇంగ్లాండ్ తో ఇండియా తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్