మహిళల హాకీ వరల్డ్ కప్-2022లో 9 నుంచి 16 స్థానాల కోసం జరిగిన పోటీల్లో కెనడాపై ఇండియా షూటౌట్ విజయం సాధించింది. రెగ్యులర్ సమయంలో ఇరు జట్లూ 1-1తో సమానంగా నిలవడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.
ఆట 11వ నిమిషంలో కెనడా క్రీడాకారిణి పేనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి స్కోరు బోణీ కొట్టింది. చివరి పావు భాగం వరకూ ఇండియా గోల్ చేయలేకపోయింది. కానీ 58వ నిమిషంలో సలీమా పెనాల్టీ కార్నర్ ను గోల్ చేసి ఇండియాకు పాయింట్ సంపాదించింది. దీనితో స్కోరు సమం అయ్యింది. షూటౌట్ లో కెనడా రెండు, ఇండియా మూడు గోల్స్ చేశాయి.
ఈ విజయంతో 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోటీల్లో ఇండియా రేపు జపాన్ తో ఆడనుంది. దీనిలో కూడా విజయం సాధిస్తే మళ్ళీ తొమ్మిదో ప్లేస్ కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.