Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ODI WC: సెమీస్ కు చేరువలో ఇండియా - ఇంగ్లాండ్ నిష్క్రమణ

ODI WC: సెమీస్ కు చేరువలో ఇండియా – ఇంగ్లాండ్ నిష్క్రమణ

బౌలర్లు మరోసారి రాణించడంతో ఇండియా ఇంగ్లాండ్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది. ఇప్పటి వరకూ 6 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్క విజయం మాత్రమే సొంతం చేసుకున్న డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 229 పరుగులు మాత్రమే చేయగా… మహమ్మద్ షమీ, బుమ్రాల పేస్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ కుదేలైంది. 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో లివింగ్ స్టన్ చేసిన 27 పరుగులే హయ్యస్ట్ స్కోర్ కావడం విశేషం. షమీ 4; బుమ్రా 3, కులదీప్ యాదవ్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఇండియా 40 పరుగులకే మూడు వికెట్లు (శుభ్ మన్ గిల్ 9; కోహ్లీ డకౌట్; శ్రేయాస్ అయ్యర్ 9) కోల్పోయింది. కెఎల్ రాహుల్ 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి బాధ్యతాయుతంగా ఆడి 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో  87 పరుగులు చేసి ఐదో వికెట్ గా ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్-49; బుమ్రా-19 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లె 3; క్రిస్ ఓక్స్, ఆదిల్ రషీద్ చెరో 2; మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.

రోహిత్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్