ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. అశ్విన్ కు ఐదు, బుమ్రా 2, కుల్దీప్ యాదవ్ 2, జడేజా ఒక వికెట్ సాధించారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మొదలైన ఈ మ్యాచ్ మూడోరోజే ముగిసింది.
ఎనిమిది వికెట్లకు 473 పరుగుల వద్ద నేటి మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోహిబ్ బషీర్ 5; అండర్సన్, టామ్ హార్ట్ లీ చెరో 2; బెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.
259 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది, ఓపెనర్ బెన్ డక్కెట్ ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 21 వద్ద మరో ఓపెనర్ జాక్ క్రాలే కూడా అశ్విన్ బౌలింగ్ లోనే సర్ఫ్ రాజ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జానీ బెయిర్ స్టో-; ఓలీ పోప్- రన్స్ చేసి అవుట్ కాగా…. జో రూట్ క్రీజులో నిలదొక్కుకొని ఒంటరి పోరాటంతో 84 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. 195 పరుగులకే ఇండియా ఆలౌట్ అయ్యింది.
ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను 4-1 తేడాతో ఇండియా కైవసం చేసుకుంది.
కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్, యశస్వి జైస్వాల్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించాయి.