Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ హాకీ: ఇంగ్లాండ్ పై ఇండియా సడన్ డెత్ విజయం

ప్రో లీగ్ హాకీ: ఇంగ్లాండ్ పై ఇండియా సడన్ డెత్ విజయం

FIH Pro-league: 2021-22 పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ లో భాగంగా ఇంగ్లాండ్ పై ఇండియా ‘సడన్ డెత్’ విజయం సాధించింది. మ్యాచ్ పూర్తి సమయానికి రెండు జట్లూ 3-3 తో సమం కావడంతో షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. ఇక్కడా రెండు జట్లూ చెరో రెండు పాయింట్లు సాధించాయి, దీనితో సడన్ డెత్ టైమ్ ద్వారా మ్యాచ్  ఫలితం తేల్చారు.

ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 8వ నిమిషంలో ఇంగ్లాండ్ తొలి గోల్ సాధించింది. 14వ నిమిషంలో ఇండియా ఆటగాడు అభిషేక్ ఫీల్డ్ గోల్ చేసి స్కొరు సమం చేశాడు. ఆట 27వ నిమిషంలో ఇండియా షంషేర్ సింగ్ మరో గోల్ సాధించి పెట్టాడు, మరు నిమిషంలోనే ఇంగ్లాండ్ రెండో గోల్ చేయడంతో ఆట తొలి అర్ధ భాగానికి 2-2 తో సమం అయ్యింది.

52వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ మరో ఫీల్డ్ గోల్ చేసి ఇండియాను ఆధిక్యంలో నిలిపాడు, ఇక మ్యాచ్ ఇండియాదే అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు వార్డ్ శామ్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేసి టై చేశారు. దీనితో  షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది. షూటౌట్ లోనూ చెరో రెండు గోల్స్ చేయడంతో సడన్ డెత్ ద్వారా అభిషేక్ ఇండియాను గెలిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular