Thursday, September 19, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: రెండ్రోజుల వన్డే మ్యాచ్- ఇండియా ఘన విజయం

Asia Cup: రెండ్రోజుల వన్డే మ్యాచ్- ఇండియా ఘన విజయం

ఆసియా కప్ మెగా టోర్నీలో సూపర్ -4 దశలో భాగంగా ఇండియా- పాకిస్తాన్ మధ్య రెండ్రోజుల పాటు జరిగిన వన్డే మ్యాచ్ లో ఇండియా 228 పరుగులతో ఘన విజయం సాధించింది. రెండోరోజు కూడా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించినా ఎట్టకేలకు పూర్తయింది. 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులతో నేడు రెండో రోజు ఆటను ఇండియా కొనసాగించింది. రోహిత్ శర్మ -56(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ; శుభ్ మన్ గిల్- 58 (52 బంతుల్లో 10 ఫోర్లు) చేసి ఔట్ కాగా కోహ్లీ-8; కెఎల్ రాహుల్-17 పరుగులతో క్రీజులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ మూడో వికెట్ కు  233 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కోహ్లీ 94బంతుల్లో  9 ఫోర్లు,  3 సిక్సర్లతో 122;  కెఎల్ రాహుల్ 106 బంతుల్లో  12 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 పరుగులు చేశారు.

ఆ తర్వాతా బ్యాటింగ్ మొదలు పెట్టిన పాక్ 17 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో ఫఖర్ జమాన్-27; ఆఘా సల్మాన్-23; ఇఫ్తికార్ అహ్మద్-23; కెప్టెన్ బాబర్ అజామ్- 10 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. బౌలర్లు నసీమ్ షా, హారిస్ రాఫ్ లు బ్యాటింగ్ కు దిగలేదు. దీనితో 128 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5; బుమ్రా, పాండ్యా, శార్దూల్, తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోహ్లీకి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్క్కింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్