Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IND Vs. WI: చివరి వన్డేలో ఇండియా భారీ విజయం- సిరీస్ కైవసం

IND Vs. WI: చివరి వన్డేలో ఇండియా భారీ విజయం- సిరీస్ కైవసం

వెస్టిండీస్ తో ఆ దేశంలో జరుగుతోన్న వన్డే సిరీస్ ను ఇండియా 2-1 తేడాతో దక్కించుకుంది. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో ఇండియా 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి వికెట్ కు 143 పరుగులు చేసింది. ఇండియా బ్యాట్స్ మెన్…

శుభ్ మన్ గిల్ – 85 (92 బంతుల్లో 11 ఫోర్లు)

ఇషాన్ కిషన్ -77 (64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)

హార్దిక్ పాండ్యా – 70*(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు)

సంజూ శామ్సన్ – 51 (41 బంతుల్లో 2 ఫోర్లు, 4  సిక్సర్లు)

సూర్య కుమార్ యాదవ్ – 35  (30 బంతుల్లో 2 ఫోర్లు, 2  సిక్సర్లు)

తో రాణించడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నస్తానికి 351 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రోమానియో షెఫర్డ్ 2, అల్జారీ జోసెఫ్, మోతీ, కారియ తలా ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన్ విండీస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు 40 పరుగులకే ఐదు కీలక వికెట్ల చేజార్చుకుంది. జట్టులో మోతీ-39; అత్నాంజే-32; అల్జారీ జోసెఫ్-26… మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 35.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4; ముఖేష్ కుమార్ 3; కుల్దీప్ యాదవ్ 2; జయదేవ్ ఉనాద్కత్ ఒక వికెట్ పడగొట్టారు.

శుభ్ మన్ గిల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్, ఇషాన్ కిషన్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించాయి.

ఈ సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్ ల టి 20లు కూడా ఇరు జట్లూ ఆడనున్నాయి, తొలి  రేపు ట్రినిడాడ్ లో మొదటి మ్యాచ్  జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్