Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్IND Vs. WI: సూర్య షో - మూడో టి 20లో ఇండియా విజయం

IND Vs. WI: సూర్య షో – మూడో టి 20లో ఇండియా విజయం

కొంత కాలంగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న సూర్య కుమార్ యాదవ్ 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులతో సత్తా చాటడంతో వెస్టిండీస్ తో జరిగిన మూడో టి 20 లో ఇండియా 7 వికెట్లతో  ఘన విజయం  సాధించింది.  తిలక్ వర్మ  ఈ మ్యాచ్ లో కూడా రాణించి 49 పరుగులతో (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) నాటౌట్ గా నిలిచాడు.

గయానా లోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన నేటి మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్రాండన్ కింగ్-43; రోమన్ పావెల్-40; కేల్ మేయర్స్-25; పూరన్-20 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.  ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3; అక్షర్ పటేల్, ముఖేష్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20ల్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ నిరాశ పరిచి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. శుభ్ మన్ గిల్ (6) సైతం విఫలమయ్యాడు. వస్తూనే విశ్వరూపం ప్రదర్శించిన సూర్య కుమార్ యాదవ్ మూడో వికెట్ కు తిలక్ వర్మ తో కలిసి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 83 రన్స్ సాధించి సూర్య  ఔటైన  తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పాండ్యా 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్  తో 20 రన్స్ తో నాటౌట్ గా ఉన్నాడు.

విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ కు 2.; ఒబెజ్ మెక్ రాయ్ కు ఒక వికెట్ దక్కింది.

సూర్యకే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం 2-1 తో విండీస్ ఆధిక్యంలో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్