India Won: వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించింది. ఇది టీమిండియాకు వెయ్యొవ వన్ డే మ్యాచ్ కావడం విశేషం. స్పిన్నర్ యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో తమ సత్తా చాటడంతో 43.5 ఓవర్లలో 176 పరుగులకే విండీస్ ఆలౌట్ అయ్యింది. ఇండియా 177 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలోనే సాధించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ- 60 (51 బంతులు, 10 ఫోర్లు, 1 సిక్సర్); మరో ఓపెనర్ ఇషాన్ కిషన్- 28 పరుగులు చేయగా సూర్య కుమార్ యాదవ్-34 ; దీపక్ హుడా-26 పరుగులతో అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో అల్జర్రి జోసెఫ్ రెండు, అకీల్ హోస్సేన్ ఒక వికెట్ పడగొట్టారు.
గుజరాత్, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్ 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది 44, 45 పరుగుల వద్ద మరో రెండు వికెట్లు, స్కోరు71 వద్ద షమ్రా బ్రూక్స్ తో పాటు కెప్టెన్ పోలార్డ్ ను కూడా చాహల్ పెవిలియన్ పంపి విండీస్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీశాడు. ఈ దశలో జేసన్ హోల్డర్ జట్టును ఆదుకొని 51 పరుగులు చేశాడు. ఫాబియెన్ అలెన్ 29 పరుగులు రాబట్టాడు. చాహల్ నాలుగు, సుందర్ మూడు, ప్రసిద్ద్ రెండు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం ఇండియా సంపాదించింది. రెండవ వందే ఇదే స్టేడియంలో బుధవారం నాడు (ఫిబ్రవరి 9) జరగనుంది
బౌలింగ్ లో రాణించిన యజువేంద్ర చాహల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read:ఇండియాదే అండర్ 19 వరల్డ్ కప్