జింబాబ్వేతో జరుగుతోన్న టి 20 సిరీస్ లో మూడో మ్యాచ్ లో ఇండియా 23 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేయగా లక్ష్య సాధనలో ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేయగలిగింది.
ఇండియా తొలి వికెట్ (యశస్వి జైస్వాల్-37) కు 67 రన్స్ చేసింది. గిల్-66; అభిషేక్ శర్మ-10; రుతురాజ్ గైక్వాడ్ – 49 పరుగులు చేసి ఔట్ కాగా, శామ్సన్-12; రింకూ సింగ్-1 పరుగుతో నాటౌట్ గా ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబని, సికిందర్ రాజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
లక్ష్య సాధనలో జింబాబ్వే 39 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కోల్పోయింది. సికిందర్ రాజా 65 ; క్లైవ్ మదండే-37 పరుగులతో రాణించారు. మిగిలినవారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3; అవేష్ ఖాన్ 2; ఖలీల్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు.
సుందర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.