Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్శ్రీలంకతో టెస్ట్ సిరీస్: ఇండియా క్లీన్ స్వీప్

శ్రీలంకతో టెస్ట్ సిరీస్: ఇండియా క్లీన్ స్వీప్

Test Series also: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇండియా 238 పరుగులతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఈ టెస్టు కూడా రెండున్నర రోజుల్లోనే పూర్తయ్యింది. 447 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక 208 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా లంక బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు.

రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 28 పరుగులతో మూడో రోజు ఆట శ్రీలంక మొదలు పెట్టింది. కుశాల్ మెండీస్- కరుణరత్నే రెండో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మెండీస్ 54 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యారు.  కరుణరత్నే ఓ వైపు నిలకడగా ఆడుతున్న అతనికి సహచర బ్యాట్స్ మెన్ నుంచి సరైన సహకారం లభించలేదు. వరుస వికెట్లు కోల్పోయింది. కరుణరత్నే సెంచరీ (107) చేసి ఏడో వికెట్ గా బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 208 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్ నాలుగు; జస్ ప్రీత్ బుమ్రా మూడు;  అక్షర్ పటేల్ రెండు; జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

శ్రేయాస్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద’ మ్యాచ్; రిషభ్ పంత్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్