Monday, January 20, 2025
HomeTrending Newsపురుషుల హాకీ :సెమీస్ లో ఇండియా

పురుషుల హాకీ :సెమీస్ లో ఇండియా

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా పురుషుల హాకీ జట్టు సెమీస్ లోకి ప్రవేశించింది. నేడు జరిగిన  క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ పై 3-1 తేడాతో విజయం సాధించి తన సత్తా చాటింది. మ్యాచ్  మొదటి క్వార్టర్ లో  దిల్ ప్రీత్ సింగ్, రెండో క్వార్టర్ లో గుర్జాంత్ సింగ్ లు ఇండియాకు రెండు గోల్స్ సాధించారు. మ్యాచ్ సగ భాగం పూర్తయ్యేనాటికి ఇండియా ­2-0 ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్ మూడో క్వార్టర్ లో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి.  నాలుగో క్వార్టర్ లో బ్రిటన్ తరఫున శామ్ వార్డ్ పెనాల్టీ కార్నర్ గోల్ చేసి స్కోరును 2-1 చేశాడు. మ్యాచ్ మరికాసేపాట్లో ముగుస్తుందనగా హార్దిక్ సింగ్  ఇండియాకు మరో గోల్ సాధించారు. మ్యాచ్ ముగిసేనాటికి ఇండియా 3-1 ఆధిక్యంతో సెమీస్ లో అడుగుపెట్టింది.

బెల్జియం, జర్మనీ, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్