Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్పారాలింపిక్స్ : ఇండియాకు మూడో స్వర్ణం

పారాలింపిక్స్ : ఇండియాకు మూడో స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడో స్వర్ణం లభించింది. పి-4 మిక్సడ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్.-1 విభాగంలో ఇండియా ఆటగాళ్ళు మనీష్ నర్వాల్ స్వర్ణ పతకాన్ని సాధించగా సింగ్ రాజ్ అధానా రజత పతకం సాధించాడు. 218.2 పాయింట్లతో మనీష్ పారాలింపిక్స్ రికార్డును తిరగరాశాడు. సింగ్ రాజ్ 216.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు.

ఒక విభాగంలో మనదేశానికే చెందిన ఇద్దరు ఆటగాళ్ళు  పతకాలు సాధించడం ఇది రెండోసారి. ప్రస్తుతం జరుగుతోన్న క్రీడల్లోనే ఈ ఘనత దక్కింది.  ఆగస్ట్ 31న జరిగిన హై జంప్ టి-63 పోటీలో భారత ఆటగాళ్ళు మరియప్పన్ తంగవేలు-రజత, శరద్ కుమార్ -కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

అవని లేఖరా, సింగ్ రాజ్ అధానా లు ఈ ఒలింపిక్స్ లో రెంసేసి పతకాలు సాధించి మరో రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు.

ఈరోజు లభించిన రెండు పతకాలతో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 15కు చేరింది. వీటిలో 3 స్వర్ణం, 7 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి పతకాల పట్టికలో ఇండియా ప్రస్తుతం 34వ స్థానంలో కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular