Sunday, January 19, 2025
HomeTrending Newsపారాలింపిక్స్ : ఇండియాకు ఐదో స్వర్ణం

పారాలింపిక్స్ : ఇండియాకు ఐదో స్వర్ణం

పారాలింపిక్స్ లో ఇండియా ఐదో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.  బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.హెచ్ -6 విభాగంలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో మన దేశ క్రీడాకారుడు కృష్ణ నగర్, హంగ్ కాంగ్  ఆటగాడు ఛు మాన్ కై పై విజయం సాధించాడు.

మొదటి సెట్ ను 21-17తో గెల్చుకున్న కృష్ణ నగర్ రెండో సెట్ ను 16-21తో కోల్పోయాడు. మళ్ళీ పుంజుకొని  21-17 తేడాతో మూడో సెట్లో విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

నేటి ఉదయం యతిరాజ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-4 విభాగంలో రజతం గెల్చుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా కృష్ణ నగర్ సాధించిన స్వర్ణంతో ఇండియా పతకాల సంఖ్య 19 కు చేరింది. వీటిలో 5 స్వర్ణం, 8 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి పతకాల పట్టికలో ఇండియా 24వ స్థానానికి చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్