Friday, November 22, 2024
HomeTrending Newsనవీన్ మృతిపై రష్యా విచారణ

నవీన్ మృతిపై రష్యా విచారణ

ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కర్ణాటక విద్యార్థి మరణంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం అయింది. తూర్పు ఉక్రెయిన్ లోని ఖర్కివ్ నగరంలో భారతీయ వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకురావటం కేంద్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. ఖర్కివ్ ముంచి ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులకు భారతీయులను తీసుకురావటం ప్రస్తుతం కష్టసాధ్యంగా ఉంది. అక్కడి నుంచి వచ్చే లోపలే ఏం జరుగుతుందో చెప్పలేని రీతిలో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఖర్కివ్ కు రష్యా సరిహద్దు దగ్గర కావటంతో మాస్కో మీదుగా భారతీయులను తరలించేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వం రష్యాను కోరింది. ఈ మేరకు ఢిల్లీలోని రష్యా రాయబారి ద్వారా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. పుతిన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్  వెల్లడించారు. రష్యా దాడుల్లో భారత విద్యార్థి (నవీన్) చనిపోయాడనే వార్తలపై రష్యా ప్రభుత్వం విచారణ జరుపుతోందని ఆయన తెలిపారు.

మరోవైపు ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ రష్యాకు సహకరించేది లేదని ఈ రోజు ప్రకటించింది. రష్యా విమానాలకు విడిభాగాల నుంచి సర్వీసింగ్ వరకు ఏ విషయంలోనూ, ఏ దేశంలోని తమ సంస్థ రష్యా ప్రభుత్వానికి సహకరించదని వాషింగ్టన్ లో ప్రకటన విడుదల చేసింది.

Also Read : ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థి మృతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్