Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్పాక్ పై విజయం : సెమీస్ లో ఇండియా

పాక్ పై విజయం : సెమీస్ లో ఇండియా

India beat Pakistan:

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2021 పురుషుల హాకీ టోర్నమెంట్ లో ఇండియా పాకిస్తాన్ పై  విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ రాజధాని ధాకాలో జరుతుతోన్న ఈ టోర్నీలో నేడు జరిగిన మ్యాచ్ లో 3-1 తేడాతో ఇండియా విజయం సాధించింది.

ఈ టోర్నీలో కొరియాతో ఇండియా ఆడిన తొలి మ్యాచ్ ­2-2తో డ్రా గా ముగియగా, రెండో మ్యాచ్ లో 9-0 తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. నేడు పాకిస్తాన్ పై విజయంతో సెమీస్ లో బెర్త్ ఖరారు చేసుకుంది.

ఆట మొదలైన ఏడవ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఇండియాకు మొదటి గోల్ అందించాడు. 42వ నిమిషంలో ఆకాష్ దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ సాధించి  2-0 ఆధిక్యం తెచ్చిపెట్టాడు. మూడో పావు బాగం మరికాసేపట్లో ముగుస్తుందనగా పాకిస్తాన్ ఓ గోల్ సాధించింది.

ఆట చివరి పావుభాగంలో 54న నిమిషంలో హర్మన్ ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ సాధించి ఇండియా ఆధిక్యాన్ని ­3-1 కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇండియా పూర్తి డిఫెన్స్ తో పాక్ కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీనితో ఇండియా విజయం ఖారారైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్