Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Asia Cup: చెలరేగిన బౌలర్లు- ఫైనల్లో ఇండియా

Asia Cup: చెలరేగిన బౌలర్లు- ఫైనల్లో ఇండియా

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా41 పరుగులతో  విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇండియా 213 పరుగులు మాత్రమే చేయగా, ఈ లక్ష్యాన్ని బౌలర్లు కాపాడి లంకను 172 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ మరోసారి రాణించి 4 వికెట్లు తీయగా, బుమ్రా, జడేజా చెరో 2; సిరాజ్, పాండ్యా చెరో వికెట్ సాధించారు.

ఇండియా బ్యాటింగ్ లో రోహిత్ శర్మ-53; కెఎల్ రాహుల్-39; ఇషాన్ కిషన్-33; అక్షర్ పటేల్-26 పరుగులతో రాణించగా, కోహ్లీ(3); హార్దిక్ పాండ్యా(5) జడేజా(4) విఫలమయ్యారు.  లంక బౌలర్లలో దునిత్ వెల్లింగే ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అసలంక 4; తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.

లంక 25 పరుగులకే మూడు వికెట్లు ( నిశాంక-6; కుశాల్ మెండీస్-15; కరుణరత్నే-2) కోల్పోయింది. జట్టులో వెల్లింగే-42; ధనుంజయ డిసిల్వా-41; మాత్రమే రాణించారు. 41.3 ఓవర్లలో  172 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఆల్ రౌండ్ ప్రతిభ చాటిన శ్రీలంక ప్లేయర్ దునిత్ వెల్లిగలె కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్