కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ శతకాల మోత, ఆ తర్వాత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ మరోసారి విశ్వరూపం ప్రదర్శించి ఏడు వికెట్లతో సత్తా చాటడంతో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకుంది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ జిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డెరిల్ మిచెల్ రాణించి 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 134 పరుగులు చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ 69; గ్లెన్ ఫిలిప్స్ 41 రన్స్ చేశారు.
షమీ 7; బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పి 50వ సెంచరీ చేయగా, శ్రేయాస్ మరోసారి సత్తా చాటి ఈ టోర్నీలో రెండో సెంచరీ సాధించాడు. విరాట్ 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 117; అయ్యర్ 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105; శుభ్ మన్ గిల్ 66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80; రోహిత్ శర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 47; కెఎల్ రాహుల్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 (నాటౌట్) పరుగులతో చెలరేగి ఆడారు.
మహమ్మద్ షమీ కి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.