వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్-2023తో విజయానికి ఇండియా 280 పరుగుల దూరంలో ఉంది, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇండియా విజయానికి 444 పరుగులు అవసరం కాగా నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. రోహిత్ శర్మ-43; చతేశ్వర్ పుజారా-27; శుభ్ మన్ గిల్-18 పరుగులు చేసి ఔట్ కాగా … విరాట్ కోహ్లీ-44; అజింక్యా రేహానే-20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 123 పరుగుల వద్ద నేడు నాలుగోరోజు ఆట మొదలు పెట్టింది. లబుషేన్(41) నిన్నటి స్కోరు వద్దే ఔటయ్యాడు. కామెరూన్ గ్రీన్-25; స్టార్క్-41 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ కమ్మిన్స్ కేవలం ఐదు పరుగులే చేసి షమి బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.
ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా-3; షమీ, ఉమేష్ చెరో 2; సిరాజ్ ఒక వికెట్ సాధించారు.
విజయానికి 147 ఓవర్లలో 444 పరుగులు కావాల్సిన దశలో ఇండియా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. నేడు 40 ఓవర్ల కోటా పూర్తయ్యింది. ఏడు ఓవర్ల ముందే ఆటను ముగించారు. చారిత్రిక టైటిల్ సాధించాలంటే ఇండియా రేపు చివరి రోజు 97 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లు తొలి సెషన్ లో సత్తా చాటితే ఇండియాకు విజయం దక్కే అవకాశాలు లేవు.