పురుషుల హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2023 ని ఇండియా కైవసం చేసుకుంది. నేడు జరిగిన ఫైనల్లో మలేషియా పై 4-3 తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. ఆట 56వ నిమిషంలో ఆకాష్ దీప్ సింగ్ చేసిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో ఇండియా ఛాంపియన్ అయ్యింది.
9 వ నిమిషంలో జగ్ రాజ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి బోణీ కొట్టాడు.
ఆ తర్వాత 14, 18, 28 నిమిషాల్లో మూడు గోల్స్ చేసిన మలేషియా జట్టు 3-1 తో ఆధిక్యం చాటుకుంది.
45వ నిమిషంలో ఒక పెనాల్టీ స్ట్రోక్ (కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్), ఒక ఫీల్డ్ గోల్ (గుర్జాంత్ సింగ్) సాధించిన ఇండియా స్కోరును సమం చేసింది.
మరో నాలుగు నిమిషాల్లో నిర్ణీత సమయం పూర్తి కావొస్తున్న దశలో ఆకాష్ దీప్ ప్రతిభ కనబరిచి జట్టు ఛాంపియన్ కావడంలో కీలక భూమిక పోషించాడు.
ఇప్పటివరకు మొత్తం ఏడుసార్లు ఈ టోర్నమెంట్ జరగ్గా నేటితో కలిపి నాలుగు సార్లు ఇండియా విజేతగా నిలిచింది. 2018లో మాత్రం పాకిస్తాన్ తో కలిసి సంయుక్తంగా ట్రోఫీ అందుకుంది.