Tuesday, April 1, 2025
Homeస్పోర్ట్స్మహిళల హాకీ: సెమీస్ లో ఇండియా ఓటమి

మహిళల హాకీ: సెమీస్ లో ఇండియా ఓటమి

టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ విభాగంలో ఇండియా సెమీఫైనల్లో ఓటమి పాలైంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ­2-1 తేడాతో పరాజయం పాలైంది.  ఆట మొదటి పావుభాగంలోనే గోల్ సాధించిన గుర్జీత్ కౌర్ ఇండియా శిబిరంలో ఆశలు లేపింది. రెండో పావు భాగంలో అర్జెంటీనా కెప్టెన్ నోయెల్ మరీనా అద్భుతమైన గోల్ సాధించి స్కోరును సమం చేసింది. మూడోపావు భాగంలో అర్జెంటీనా మరో గోల్ చేసి ­2-1 తో పైచేయి సాధించింది.  ఆట చివరి భాగంలో ఇండియాకు గోల్ చేసే ఏ అవకాశాన్నీ అర్జెంటీనా జట్టు ఇవ్వలేదు. దీనితో ­2-1 తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది అర్జెంటీనా.

గురువారం ఉదయం ఇండియా – గ్రేట్ బ్రిటన్ జట్ల మధ్య కాంస్య పతకం కోసం, మధ్యాహ్నం అర్జెంటీనా- నెదర్లాండ్స్ మధ్య  ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్