కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించాలన్న భారత పురుషుల హాకీ జట్టు ఆశలు నెరవేరలేదు. నేడు జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 7-0 తేడాతో ఇండియాను ఓడించింది. ఆట తొలి పావు భాగం నుంచే భారత ఆటగాళ్ళు వరుస తప్పిదాలతో ఆసీస్ కు వరుస పెనాల్టీ కార్నర్ అవకాశాలు అందిస్తూ వచ్చారు.
9, 14 నిమిషాల్లో ఒక పెనాల్టీ కార్నర్, ఒక ఫీల్డ్ గోల్ తో తొలి పావు భాగంలో 2-0ఆధిక్యంలో ఆసీస్ నిలిచింది.
22వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ గోల్ చేసిన 26వ నిమిషంలో మరో ఫీల్డ్ గోల్ చేసింది, 27వ నిమిషం లో మరో ఫీల్డ్ గోల్ చేసి తొలి అర్ధ భాగానికి 5-0 ఆధిక్యంలో నిలిచింది. 42, 46 నిమిషాల్లో మరో రెండు గోల్స్ ఆసీస్ జట్టు సాధించింది.
కొంతకాలంగా మంచి ఆటతీరు ప్రదర్శిస్తూ వస్తోన్న భారత పురుషుల హాకీ జట్టు అత్యంత కీలకమైన మ్యాచ్ లో పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. ఆసీస్ కు ఏమాత్రం ఎదురు నిలవలేకపోయింది. ఏ దశలోనూ మన ఆటగాళ్ళు సత్తా చాటలేకపోయారు.